బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం -ఆన్లైన్ హాజరు నిబంధనలు పాటించాల్సిందే -ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

దసరా సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం
నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ హాజర్ విధానానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను తాజాగా విడుదల చేసింది. ‘విద్యార్థుల హాజరును యాప్లో ఉదయం 9.30 గంటల్లోపు పూర్తి చేయాలి. ఉదయం 9:00 కల్లా ఉపాధ్యాయులు హాజరు వేసేయాలి. ప్రత్యేక విధులకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు కచ్చితంగా వెళ్లిన ప్రదేశం నుంచి మళ్లీ హాజరు వేయాల్సి ఉంటుంది. సెలవు పెట్టుకునే టీచర్లు ఉదయం 9 గంటల కంటే ముందే యాప్లో దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలను పాటించకపోతే మెమోలు జారీ చేస్తాం’ అని హెచ్చరిస్తూ ఐటీ సెల్ ఆదేశాలను జారీ చేసింది. పాఠశాల హాజరు యాప్ ను సైతం నవీకరించినట్లు పేర్కొంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *