దర్శి లోని ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మి పద్మావతి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించి అనంతరం ఆర్యవైశ్యులు నిర్వహించిన అమ్మవారి లడ్డు వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం అమ్మవారి నగరోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తీర్థ ప్రసాదలను స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన శిద్దా దంపతులను ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళలు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
