దసరా పండగ రోజు అమ్మవారి ఆలయాల్లో పూజలు…… పారువేట మహోత్సవం నిర్వహణ….

తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం విజయ దశమి పండుగను జరుపుకున్నాయి. అమ్మవారిని ఘనంగా పూజించి గ్రామోత్సవాలు నిర్వహించారు. తాళ్లూరు, తూర్పు గంగవరంలలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. తాళ్లూరులో దేవతా మూర్తుల విగ్రహాలను గ్రామాలలోని వీధులలో మేళ తాళాలతో బాణ సంచా కాలుస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లి పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీసభ్యులు, గ్రామపెద్దలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తాళ్లూరులో పలుచోట్ల నిర్వహించిన కోలాటం ప్రదర్శనలు భక్తులను ప్రజలను ఆకర్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *