ఆర్బీకేల్లో ఈ-క్రాప్ జాబితాల ప్రదర్శన -జిల్లాలో 3,54,351 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు

జిల్లాలో 3,54,351 ఎకరాల్లో సాగైన పంటలు ఈ క్రాప్ లో నమోదైనట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీని వాసరావు తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఈ క్రాప్ నమోదు ముసాయిదా జాబితాలను ప్రదర్శిస్తామన్నారు. గ్రామస భలు కూడా నిర్వహించి ముసాయిదా జాబితా లను సభల్లో చదివి వినిపిస్తారని తెలిపారు. ఈ- క్రాప్ కు సంబంధించిన అభ్యంతరాలు ఎమైనా ఉంటే రైతులు ఆయా సచివాలయాల పరధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులు, సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ క్రాప్-2023 ఖరీప్ కు సంబంధిం చి జాబితా సవరణకు ఆఖరి అవకాశం అని చెప్పారు. రైతులు ఏమైనా తప్పులు దొర్లితే సరి చేసుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *