కంది పంట సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు
పాటించినట్లయితే అధిక లాభం పొంద వచ్చని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన మల్కాపురం, రాజానగరం గ్రామాలలో పర్యటించారు. కంది రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ … తాళ్లూరు మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నేడు రైతులు కంది పంట వైపు దృష్టి సారిస్తున్నారని దాదాపుగా మండలంలో 1445 ఎకరాల విస్తీర్ణంలో కంది పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా పురుగు సోకకుండా చేసుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అశోక్, రైతులు పాల్గొన్నారు.
