విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించడం మన బాధ్యతని ఎంఈఓ సుబ్బయ్య అన్నారు. తాళ్లూరు మండల విద్యావనరుల కేంద్రంలో బుధవారం రాష్ట్ర అచీవ్మెంట్ సర్వేలో ప్రవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఓరియంటేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 3, 6, 9 తరగతులకు టెస్ట్ కండక్ట్ చేయడంపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో ఎంఈఓ -2 సుధాకరరావు, ట్రైనర్నరసింహారావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
