మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో తాళ్లూరు మండలంలో చేపట్టిన పనులను అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జి వెంకట స్వామి శుక్రవారం పరిశీలించారు. కార్యాలయంలో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జిజిఐ) పెరా మీటర్స్లో బాగంగా అన్ని రకాల ఫైల్స్, సమాచార బోర్డులు, జాబ్ కార్డులు పరిశీలించారు. ఉద్యాన వన తోటల పెంపకంలో బాగంగా తోటలను పరిశీలించారు. ఎంపీడీఓ కెవై కీర్తి, ఎపీఓ మురళి, ఒంగోలు క్లస్టర్ ప్లాంటేషన సూపర్వైజర్ బాల కిరణ్, టీఏలు, ఎఫ్ఎలు పాల్గొన్నారు.

