చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యాపకుడు నగేష్ బాబు జెఎన్టీయూ అనంతపూర్ నుంచి డాక్టరేట్ ( పీహెచ్ఐ) పొందారు. జెఎన్టీయూలో డాక్టర్ బి. వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఫీచర్ ఎక్సాట్రాక్షన్ ఫర్ పాచ్ బేస్డ్ ఇమేజ్ క్లాసిఫికేషన్ యూజింగ్ లంగ్ సిటీ స్కాన్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. డాక్టరేట్ పొందిన నగేష్ బాబును కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ మొయిద వేణుగోపాల్ రావు, సీఎస్సీ విభాగపు అధిపతి డాక్టర్ హరిణిలు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.
