శ్రీ సరస్వతి విద్యాసంస్థల డైరెక్టర్ గంగా శంకర్ రెడ్డి వివాహమహొత్సవం శుక్రవారం
రాత్రి వైభవంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ ఎవి రమణా రెడ్డి, పద్మజ దంపతులు, డైరెక్టర్ ఆవుల గణేష్ రెడ్డి, ఆమణి దంపతులు అతిరథ మహారథులకు ఘన స్వాగతం పలికారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వేద మత్రాల మధ్య వివాహం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు తరలిరావటంతో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రత్యేక కౌంటర్ల అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి విందు భోజనం ఏర్పాటు చేసారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వైవీ భద్రా రెడ్డి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి, చీరాల కనిగిరి ఎమ్మెల్యేలు కరణం బలరాం కృష్ణమూర్తి బుర్ర మధుసూదన్ యాదవ్ , ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నారపుశెట్టి పాపారావు, టిటిడి పాలక మండల సభ్యుడు శిద్దా సుధీర్ కుమార్, అద్దంకి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య, వైఎస్సార్సీపీ యూత్ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, గొర్రెపాటి శ్రీనివాస రావు, మద్దిశెట్టి శ్రీధర్, నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, మాజీ ఎఎంసీ చైర్మన్ మారం వెంకట రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, సోము దుర్గా రెడ్డి. మాజీ ఎంపీపీలు పాశం మధుసూధన రెడ్డి, కోట రామిరెడ్డి, గోళ్లపాటి మోషే, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీ సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, ఎస్ఎస్ఎన్ క్రిష్ణా రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, జిల్లాలోని విద్యాసంస్థల అధిపతులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు .






