విజయ్ సాయి రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ తమ అధ్యక్షురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి డౌన్డౌన్ అంటూ మంగళవారం స్థానిక ప్రకాశం భవనం కలెక్టరేట్ ధర్నాస్థలి వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఉన్నం నళిని మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి నాయకులు రాబోయే ఎన్నికల్లో తమ అపజయాన్ని ఊహించి ప్రత్యర్ధి పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు, బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారని …… తమ పాలనలోని లోటుపాట్లను ఎత్తి చూపిన మా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కి సమాధానం చెప్పకుండా, సమాధానం చెప్పలేక ఒక పార్లమెంటు సభ్యుడిగా విజయసాయి రెడ్డి నీచమైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వారి పతనానికి పరాకాష్టగా మేం భావిస్తున్నామని తెలిపారు. ధర్నాలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

