ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గంలో దీపావళి వేడుకలు సందడిగా నిర్వహించారు. చిన్నారులకు ఇష్టమైన పండుగ కనుక ఎక్కువగా చిన్నారులు దీపావళి సామగ్రిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నందిని దంపతులు దర్శిలోని వారి స్వగృహం వద్ద దీపావళి వేడుకలు ఆయన అభిమానులు, కార్యకర్తలు, సిబ్బందితో కలసి ఉత్సాహంగా వేడుకగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు కీసరి రామ్ భూపాల్ రెడ్డి, బాపి రెడ్డి, బిజ్జం శ్రీనివాస రెడ్డి, నరసింహా రెడ్డిలతో పాటు అధిక సంఖ్యలో నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు కలసి ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.








