ఉద్యాన రైతులు విజ్ఞాన యాత్రలతో మరింత సాంకేతిక, నూతన పరిజ్ఞానం పెంపొందించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి వై గోపిచంద్ అన్నారు. జిల్లా కార్యాలయం నుండి బుధవారం కొత్త పట్నం, టంగుటూరు, నాగులుప్పల పాడు, చీమకుర్తి, పొదిలి, కొండెపి మండలాలకు చెందిన జౌత్సాహిక రైతులు బాపట్ల జిల్లాలోని అద్దంకి, మార్టూరు మండలాలలో ఉద్యాన పంటల సాగులో పాటిస్తున్న నూతన సాంకేతికత విధానాలను పరిశీలించేందుకు యాత్రను నిర్వహించారు. జిల్లా ఉద్యానశాఖాధికారి వై గోపిచంద్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. బొబ్బెపల్లి గ్రామంలో షేడ్ నెట్, పాలీ హౌస్లో క్యారెట్, ముల్లంగి, కాప్సికం, కొత్తిమీర, పూల సాగు, నీటి కుంటలలను, ప్యాక్ హౌసులు, కలెక్షన్ సెంటర్, కోల్డ్ రూమ్, శాశ్విత కూరగాయ పందిళ్లు, సుగంధ పంటల సాగు, డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా సుగంధ తైలము తీయు విధానం పరిశీలించారు. అద్దంకి మండల చిన్న కొత్తపల్లిలో పాలీ హౌస్ల చామంతి, గులబి పూల సాగులో పాటిస్తున్న మెలుకువలను ఉద్యాన వన శాఖ అధికారులు యం. శ్రీలక్ష్మి, డి ప్రత్యూషలు రైతులకు వివరించారు.




