నూతన సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చెయ్యాలని బిజేపి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్ అన్నారు. స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ శాఖ, డిగ్రీ లెక్చరర్లులతో పాటు నూతన సంవత్సరంలో డిఎస్సీను కూడ ప్రకటించాలని కోరారు. డీఎస్సీ విడుదల చేయకుంటే పార్టీ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తామని అన్నారు. జిల్లా అధికార ప్రతినిథి బొద్దిలూరు ఆంజనేయులు, బిజేవైఎం జిల్లా కార్యదర్శి నాయక్, యువమోర్చా జిల్లా ఇన్చార్జి ఆంజనేయులు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
