న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగు తుందని, బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు – సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు జీవీ కొండారెడ్డి

న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగు తుందని, బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు జీవీ కొండారెడ్డి స్పష్టం చేశారు. అంగన్వా డీ కార్యకర్తల డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం దర్శి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట 32వ రోజు ధర్నా కొన సాగించారు. ధర్నాను ఉద్దేశించి కొండారెడ్డి మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి, సంజాయిషీ నోటీసులు ఇచ్చి విధుల్లో చేరాలని బెదిరించటం దారుణమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీల జీతాలను రూ.26వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు టి. రంగారావు, సందు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, యూనియన్ నాయకురాళ్లు నాగ మణి, బాలమ్మ, సుజాత, సరోజ, ప్రశాంతి, విశ్వ వాణి, దేవిభాయి, శివకుమారి, వెంకటరమణ, యశోద తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *