రైతు పక్షపాతినని చెప్పుకోవడం హాస్యాస్పదం.రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యం – బిజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి – ప్రకాశం భవనం వద్ద బిజేపి మహాధర్నా

5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, 15 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలని, 43.5 టి.యం.సి.ల వరద నీటిని, నిల్వ ఉంచాలని నిర్ణయించి ప్రారంభించిన ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని వెలుగొండ ప్రాజెక్ట్ 2005సం.లో నిర్మాణం ప్రారంభించినా ఇంతవరకు పూర్తికాలేదు. 18.8 కి. మీ. టన్నెల్ పూర్తి చేయాల్సి ఉందని కనుక టన్నెల్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని, నిర్వాసితులకు ఆర్. ఆర్. ప్యాకేజీని ప్రకటించి 3 జిల్లాల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలని భారతీయ జనతాపార్టి కిసాన్ మోర్చా రాష్ట్స అధ్యక్షులు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బొంతల కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం వద్ద గల ధర్నాస్థలి వద్ద ఏర్పాటుచేసిన మహా ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు ధర్నాకు విచ్చేసిన కార్యక్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

వారు మాట్లాడుతూ ఇటీవల మిచౌంగ్ తుఫాన్ కారణంగా, ప్రకాశం జిల్లాలో మిర్చి, వరి, మొక్కజొన్న, పొగాకు, కంది, సజ్జ, వేరుశనగ, అలసంద, పెసలు, అరటి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వము రైతులను ఇంతవరకు ఆదుకోలేదు. రైతన్నల ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంటనే మిచౌంగ్ తుఫాన్ బాధిత రైతన్నలకు నష్టపరిహారాన్ని అందిచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నాలుగున్నర సం.ల నుండి డిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ క్రింద పనిచేస్తున్న కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వని కారణంగా పనులు పూర్తి కాలేదు దాంతో ఒక ఎకరా భూమి కూడా తడవలేదు. కనుక వెంటనే కాంట్రాక్టర్లకు పని డబ్బులు ఇచ్చి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు నీరు అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ఫసల్ బీమా యోజన పథకము రాష్ట్ర రైతులకు చేరడం లేదని కనుక నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీచౌంగ్ తుఫాన్ వలన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు పడిపోయినా ఇప్పటి వరకు కొత్తవాటిని అమర్చడానికి ప్రభుత్వం చొరవ చూపలేదని, దీనివలన పై ఎగువ నుండి వచ్చే నీరంతా సముద్రంలోకి వెళ్లిపోవడం జరుగుతున్నదని కావున వెంటనే కొత్త గేట్లు అమర్చాలని వారు ప్రభుత్వానికి కోరారు.

ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బిజెపి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురవరం వీర రాఘవ రెడ్డి, రమేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జ్ మురళి కృష్ణ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ పరుచూరి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షలు ఆదినారాయణ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వినోద్, జిల్లా కిసాన్ కార్యదర్శి పువ్వాడి నారాయణ మరియు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *