దర్శి నూతన ఎస్సైగా జి.శివనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్ కు చెందిన ఆయన ఒంగోలు డీసీఆర్బీ నుంచి బదిలీపై దర్శికి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, పామూరు, తాడివారిపల్లి,సంతమాగులూరు స్టేషన్లో విధులు నిర్వ ర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎన్నికల తరుణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన నేరుగా తనను కలవచ్చని చెప్పారు . బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కు పలువురు అభినందనలు తెలిపారు.
