వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలు అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. దర్శి పట్టణంలోని డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ గజ మాలతో డాక్టర్ బూచేపల్లిని సన్మానించి బర్త్ డే విషష్ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సతీమణి నందిని, కుటుంబసభ్యులు పాల్గొని కేక్ ను కట్ చేయించి రంగ రంగ వైభవంగా బర్త్ డే ను జరుపుకున్నారు. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , మంత్రి మెరుగా నాగార్జున ల తో పాటు దర్శి నియోజవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలలోని ప్రజా ప్రతినిథులు, జెసీఎస్ కన్వినర్లు, పార్టీ బాధ్యులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ బూచేపల్లిని ఘనంగా సన్మానించి బర్త్ డే విషష్ తెలిపారు.






















