సికింద్రాబాద్ సెప్టెంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) : SIR-2 పై బుధవారం సికింద్రాబాద్ హరిహర
కళా భవన్ లోని మున్సిపల్ కార్యాలయంలో అమీర్పేట్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మరియు సనత్నగర్ ఈ ఆర్ ఓ సుజాత ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో SIR-2 విధానంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న నోటీసులను సంబంధిత ఓటర్లకు వెంటనే అందజేయాలని సూచించారు. నోటీసులు అందజేసిన వారి నుండి త్వరితగతిన జవాబులు తీసుకోవాలని కోరారు అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఒకవేళ అర్హత కలిగిన ఓటును తొలగిస్తే వారి తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఆర్ ఓ గాయత్రీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమిలి ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దయానంద్ , నాయకులు ఆకుల మహేష్, క్రాంతి కుమార్, వి. దయానంద్ రావు, అశ్విని ,ఆకుల ప్రతాప్,సందీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
