రైతుల అభ్యున్నతికి కోసం ప్రభుత్వం కృషి – దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి

తాళ్లూరు: రైతులు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు అన్నారు. డీఆర్ డీఏ, వెలుగు ప్రాజెక్టులు సంయక్తంగా ఏర్పాటు చేసిన సహాకార వ్యవసాయ ఉత్తత్పుల సంస్థను డాక్టర్ గొట్టిపాటి బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నాడు సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల అభ్యున్నతికి పునాదులు వేసారని, నేడు వారి ఆర్థిక కుటుంబపరిస్థితులు మెరుగైన విషయాన్ని గమనిస్తున్నామని అన్నారు. అదే విధంగా వ్యవసాయ పనిముట్ల హైరింగ్ కేంద్రం మహిళ సంఘాల మరింత బలోపేతానికి చేయూత ఇస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలు అభ్యున్నతికి చేస్తున్న కృషిని వివరించారు. డీఆర్డీఏ పీడీ నారారాయణ హైరింగ్ సెంటర్ ప్రాముఖ్యతను వివరించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి ఎఎంసీ చైర్మన్ డిఎన్ సుబ్బారావు, ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ బివి రమణా రావు, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బయ్య, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగరెడ్డి, ఇడమకంటి రమణా రెడ్డి, సుబ్బా రెడ్డి, మానం రమేష్ బాబు, ఓబులు రెడ్డి, పిన్నిక రమేష్, రాచకొండ వెంకటరావు, విద్యాసాగర్, కైపు రామకోటి రెడ్డి, కొర్రపాటి వేణు, హనుమా రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, చిన నాగిరెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి ఆయా గ్రామాల నాయకులు ఎంఎంఎస్అధ్యక్షురాలు సుజాత, ఎపీఎం దేవరాజ్, ఏ ఓ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొదుపు సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *