ప్రజా ప్రతినిథిగా మరింత సేవ చేసేందుకు అవకాశం – ఎంపీపీ తాటికొండ, జెడ్పీటీసీ మారం, వైస్ ఎంపీపీ ఇడమకంటి

తాళ్లూరు: ప్రజా ప్రతినిధిగా మరింత సేవ చేసేందుకే రాజకీయాలలోనికి వచ్చానని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు చెప్పారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ దశాబ్ధ కాలంగా జెడ్పీటీసీగా రెండు మార్లు గెలిపించి అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీలు బాల కోటయ్య, యామర్తి ప్రభుదాస్ పలువురు తమ అనుభవాలను సభలో ప్రస్తావించారు. అధికారులు తమశాఖల పురోగతిని వివరించిన తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు తమ పదవీ కాలంలో ప్రజా సేవ కోసం తమ శాఖల పరంగా అడిగిన విధానం తాము స్పందించిన తీరును సభ దృష్టికి తెచ్చారు. ఎంపీపీడీఓ అజిత, తహసీల్దార్ బివి రమణా రావు, డీఈలు మాధవ రెడ్డి, శ్రీనివాస రావు, ఏఈలు రామక్రిష్ణా,హనుమంత రావు, ఎంఈఓలు సుబ్బయ్య, సుధాకర్లు వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ యాదవ్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, గ్రామకార్యదర్శులు వెంకటాద్రి, నాగమల్లేశ్వరి, హెచ్ఎస్ రవి తదితరులు గత ఐదేళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు స్పందన హుందా గా ఉందని సభ దృష్టికి తెచ్చారు. కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగరెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్య సభ దృస్టీ కి తెచ్చారు . అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీని, ఎంపీటీసీలను మండల ప్రజాపరిషత్ సిబ్బంది, వెలుగు, ఉపాధి హామీ, వ్యవసాయశాఖ ఎవో ప్రసాదరావు, విద్యాశాఖలో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *