జగనన్నతోనే భవిష్యత్ -బాలినేని శ్రీకావ్య – 47వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలు శ్రీకావ్య

జగనన్నతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్ అని, పేదల అభ్యున్నతికి కోసం ఒంగోలు ఎమ్మెల్యే మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి ఎంతో కృషి చేసారని రాబోవు ఎన్నికలలో వారికి ప్రతి ఒక్కరూ బలపరచి మంచి మెజార్టీలో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య కోరారు. 47వ డివిజన్లో శుక్రవారం మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో బాగంగా బాలినేని శ్రీకావ్య స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. డివిజన్ లోని1, 4,5,6 వీధులలోని నివాసాలకు వెళ్లి ఒంగోలు నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ “మన ఒంగోలు- మవ వాసన్న” కరపత్రికలు అందిస్తూ మావయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి తన హయాంలో ఒంగోలులో ఎంతో అభివృద్ధి చేసారని, పేదల పక్షపాతిగా ఇళ్ల స్థలాలు అందించారని గుర్తు చేసారు. చేసిన ప్రగతి గురించి చెప్పారు. ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డికి, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి, వేయించి బలపరచాల్సిన ఆవశ్యకతను వివరించారు. తప్పక ఓటు వెయ్యాలని సూచించారు. ముందుగా స్థానిక నాయకులతో కలసి 6వ లైన్లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ముందుగా డివిజన్ ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి, మహిళలు బాలినేని శ్రీకావ్యకు బొకేలు, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు, ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇప్పాల శివా రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వినర్లు సి సుబ్రమణ్యం, పసుపులేని ఏడుకొండలు, ముఖ్య నాయకులు ఈ సరసింహారావు, దీలీప్ కుమార్ , వాకా సుబ్బా రెడ్డి, సునీల్, హరీష్, మనోజ్ కుమార్, సీహెచ్ బాల మాలకొండయ్య, హరి క్రిష్ణా రెడ్డి, మాజీ వలంటీర్లు, గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *