ఎండలు మండిపోతున్న తరుణంలో రాణిగంజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాటసారులకు ఎండవేడిమి నుంచి సేదతీరుస్తున్నారు. రాణిగంజ్లోని రాణీగంజ్ మార్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. విఫరీతమైన ఎండతో వాహనదారులు, బాటసారులు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మజ్జిగతో పాటు నిమ్మరసం, కూల్ డ్రింక్స్. పండ్ల రసాలు ఒక్కో రోజు ఒక చల్లని పానియాలను అందుబాటులో ఉంచుతూ తమ మానవత్వాన్ని చాటుతున్నారు. ఎండాకాలం పూర్తయ్యేంత వరకు ఇది కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
