మే-13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంక్షేమ పాలనను స్వాగతించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరారు. పట్టణంలో పలు డివిజన్లో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ‘మన ఒంగోలు- మన వాసన్న’ కర పత్రాలను పంపిణీ చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఇన్చార్జి నితిన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి, కార్పోరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గురువా రెడ్డి, కొండా రెడ్డి, నరసారెడ్డి, విక్రమ్ రెడ్డి, మండతల నాని, చెంచిరెడ్డి, రమణమ్మ, మంజుల తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
