మే-13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంక్షేమ పాలనను స్వాగతించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరారు. పట్టణంలో పలు డివిజన్లో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ‘మన ఒంగోలు- మన వాసన్న’ కర పత్రాలను పంపిణీ చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.44వ డివిజన్లో ..మారుతీ నగర్ రెండవ లైన్లో డివిజన్ ఇన్చార్జి నరసింహా రెడ్డి, కోఆర్డినేటర్ సతీష్, డివిజన్ అధ్యక్షుడు, కార్పోరేటర్ గోపి రెడ్డి గోపాల్ రెడ్డి నాయకులు ఉదయగిరి క్రిష్ణ, మోతడిక అంకయ్య, గడివేముల అంకయ్య, పునుగోటి రాజేశ్వరి, టి శ్రీనివాస రెడ్డి. పెద్ది రెడ్డి, కూరేటి బాల నాగేష్, శంకర్ రెడ్డి, శివయ్య, చెన్నూరి మాధవ్, చెన్నూరి కేశవ, కొండారెడ్డి, చెన్నూరి రవి చంద్ర, వలంటీర్లు, గృహా మిత్రలు పాల్గొని ఒంగోలులో వాసన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించే పత్రాలు అందించారు.

