మే-13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంక్షేమ పాలనను స్వాగతించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరారు. పట్టణంలో పలు డివిజన్లో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ‘మన ఒంగోలు- మన వాసన్న’ కర పత్రాలను పంపిణీ చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.43వ డివిజన్లో .శ్రీనివాస కాలనీలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కె రమణయ్య యాదవ్, ఇన్చార్జి యూవీ సుబ్బారావు, కార్పోరేటర్ కండె స్వాతిరమణయ్య, కండె వెంకటేశ్వర్లు, హనుమంతరావు, వద్దు శ్రీనివాసరావు, క్రిష్ణా రెడ్డి, కండె సురేష్, రోశమ్మ. శివ పార్వతి తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు.
43వ డివిజన్ పరధిలోని 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక శ్రీరామ కాలనీకి చెందిన వారు చేరిక
వైఎస్సార్సీపీలోనికి టిడిపి నుండి వలసలు కొనసాగుతున్నారు. ఆదివారం బయ్యన బోరిన బాల రాజు, 43వ డివిజన్ అధ్యక్షుడు కండే రమణ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీకి చెందిన తోక రాజు, కండ్ల గుంట బ్రహ్మయ్య, పల్లెబోయిన దేవరాజు, కిలారి శ్రీను, తోక వీరయ్య, తగర బుజ్జి, గుర్రపుశీల గురవయ్య, ఆళ్ల వెంకటేశ్వర్లు, తదితర 30 కుటుంబాలకు చెందిన సభ్యులు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షుడు కండే రమణ యాదవ్, పూర్ణ ప్రభావతి, కండే వెంకటేశ్వర్లు, వద్ది శ్రీను, అణు, పాశం లక్ష్మి నారాయణ, నాలి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

