మే-13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంక్షేమ పాలనను స్వాగతించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరారు. పట్టణంలో పలు డివిజన్లో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ‘మన ఒంగోలు- మన వాసన్న’ కర పత్రాలను పంపిణీ చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.49వ డివిజన్ పరిధిలో డివిజన్ కార్పోరేటర్ అంగరేకుల గురవయ్య, ఇన్చార్జీ తాళ్లపాలెం శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు, నాయకులు కసిబిసి నాగేశ్వరరావు, కందూరి పుల్లా రెడ్డి, సూరసారి నర్సా రెడ్డి, బత్తుల కాశయ్య, ఢాకా రాఘవ రెడ్డి, బలరామ్ క్రిష్ణ యాదవ్, గోపిదేశి నాగేశ్వర రావు, వీరనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, దిలీప్ కుమార్, అంగిరేకుల బాల గురవయ్య, మల్లిఖార్జున్,జయరాం, షేక్ గౌస్ నాయబ్సూల్, అంగిరేకుల నాగేశ్వరరావు, కుర్ర గురు సత్యం, మళ్లీబోయిన వెంకటేష్, కసిబిసి వీర బ్రహ్మం తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.



