ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో మాజీ మంత్రి తలసాని దంపతులు పూజలు.

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు సోమవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పెండ్లి రోజు సందర్భంగా అమ్మవారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యే దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మారేడ్ పల్లి లో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజలలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కిషోర్, ఆంజనేయులు, ఆకుల హరికృష్ణ, నాగులు, మహేష్, మహేందర్, అరుణ్ భట్, ఓదెiల సత్యనారాయణ, జగదీష్ ప్రసాద్ వర్మ, దుబాయ్ శ్రీను, లావణ్య తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *