సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ కు హస్తం గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోట నీలిమ ఓటర్లను కోరారు. శని వారం చివరి రోజు ప్రచారం లో భాగంగా ఓల్డ్ పాటిగడ్డ లో సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు,బేగంపేట కంటెస్ట్డ్ కార్పొరేటర్ షేక్ గౌస్ ఆధ్వర్యం లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి దానం నాగేందర్ ను గెలిపించాలని కోరారు.షేక్ గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.ప్రధానిగా రాహుల్ గాంధీని చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం లో వివిధ వర్గాల ప్రజలు వున్నారని,వారు అంతా కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలన్నారు.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం మరింత అభి వృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. ఈ కార్యక్రమం లో మహమ్మద్ అశ్ల మ్ తదితరులు పాల్గొన్నారు.

