సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో శని వారం కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఉన్న అన్ని నియోజక వర్గం.డివిజన్ల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ గా తరలి వచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ సికింద్రబాద్ క్లాక్ టవర్ ,రైల్వే స్టేషన్ మీదుగా బేగంపేట్ మీదుగా సాగింది. ఈ ర్యాలీ లో సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అగ్రభాగాన వుండి బైక్ నడుపుతూ కార్య కర్తలలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో అభి వృద్ధి చేయాలంటే తనకు హస్తం గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ,డిప్యూటి మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఆదం సంతోష్ కుమార్,సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్.బీ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్,మహమ్మద్ ఆశ్లాం, కాంగ్రెస్ పార్టీ,నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



