పద్మారావు గౌడ్ గెలుపు తోనే సికింద్రబాద్ అభివృద్ధి….సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్
గెలుపు ఖాయమని,ఆయన గెలుపు తోనే సికింద్రబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా సుమారు 4 వేల
బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని షెనై గ్రౌండ్ వద్ద ఎమ్ పి అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. షెనై గ్రౌండ్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ సంగీత్, చిలకలగూడ, పద్మారావు నగర్, ముషీరా బాద్, భోలక్ పూర్, ఐ డి హెచ్ కాలనీ, బోయి గూడ, బన్సీలాల్ పేట, మోండా మార్కెట్, మహంకాళి టెంపుల్ లైన్, సింది కాలనీ, పాటిగడ్డ, ఓల్డ్ కష్టమ్, సనత్ నగర్, జెక్ కాలనీ, ఉదయ్ నగర్, 60 ఫీట్ రోడ్, బల్కంపేట, డి కే రోడ్, కనకదుర్గమ్మ టెంపుల్, గురుద్వార్ మీదుగా సత్యం థియేటర్ వరకు సాగింది. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేశారు. ఎమ్ పి అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కుర్మ హేమలత, కొలన్ లక్ష్మీ, టి. మహేశ్వరి, సనత్ నగర్, సికింద్రాబాద్ ఎన్నికల ఇంచార్జి లు వెంకట్ రెడ్డి, మేడే రాజీవ్ సాగర్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు అశోక్ యాదవ్, శ్రీహరి, ఏసూరి మహేష్, నాగులు, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఖలీల్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి, శేఖర్, సురేష్ గౌడ్, ఆరీఫ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *