పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సోమవారం నిర్వహించిన ఎన్నికలలో
బీ జే పి నాయకులు యామ గోని గంగాధర్ గౌడ్ , శ్వేత దంపతులు బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లో తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా యామ గొని గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ… మల్కాజ్ గిరీ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీ జే పి అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీ తో విజయం సాధిస్తారు అని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేంద్రంలో ముచ్చటగా మూడో సారి నరేంద్ర మోడీ జీ ప్రధానిగా అవుతారని గంగా ధర్ గౌడ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
