కాంగ్రెస్ కార్యకర్తలు కార్లలో వచ్చి డబ్బులు పంచుతున్నారని బేగంపేట పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని.ఇదే విషయాన్ని తాను స్వయంగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇన్స్ పెక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన తనను ఉష్.చుప్ అంటూ తన ను నిలువరించారని కంటోన్మెంట్ బీ జే పి అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్ ఆరోపించారు .బేగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా రసూల్ పురా గన్ బజార్ వద్ద కాంగ్రెస్ నాయకులకు చెందిన రెండు కార్లను బీ జే పి శ్రేణులు ,పోలీసులు నిలువరించగా ఒక డ్రైవర్ తప్పించుకుని వెళ్ళాడు అని అన్నారు.మరో కారును పట్టుకుని పోలీస్ లకు పిర్యాదు చేశామన్నారు.వదిలి వెళ్ళిన కారులో డబ్బు సంచి వుందని.ఎలా వదిలేస్తారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ లను డిమాండ్ చేశారు.కారు వదిలేసిన ఘటనపైన చర్యలు తీసుకోవాలని తాను ఇన్స్ పెక్టర్ రామయ్యను కోరగా ఆయన తన పట్ల పరుషంగా వ్యవహరించారని,ఇన్స్ పెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు,పిర్యాదు చేయనున్నట్లు తిలక్ చెప్పారు.అధికార పార్టీకి పోలీసులు వత్తాసు గా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రజా స్వామ్యం లో ఇలాంటి ఘటనలకు చోటు ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు.


