సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన దానం

సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ సోమవారం సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో వివిధ ప్రాంతాల్లో వున్న పోలింగ్ కేంద్రాల ను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని నల్లగుట్టలో పోలింగ్ కేంద్రాల ను సందర్శించి ఓటింగ్ సరళిని గురించి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిరాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ఎన్నికల ఇన్చార్జి ,సనత్ నగర్ నియోజక వర్గం ఏబ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ ను అడిగి తెలుసుకున్నారు .ఓటింగ్ సరళి నమోదుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ,రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట .పీ జీ రోడ్ బేగంపేట డివిజన్ ఎన్నికల ఇన్చార్జి సనత్ నగర్ నియోజక వర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్,రామ్ గోపాల్ పేట డివిజన్. అధ్యక్షులు మల్లిఖార్జున్,మహమ్మద్ సజ్జాద్,మహమ్మద్ అశ్లాం తదితరులు వున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *