జిల్లాలో దర్శి నియోజకవ ర్గంలో అత్యధికంగా 91 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో 90.35 శాతం నమో దైంది. అప్పట్లో వైఎస్సార్ సీపీకి దర్శి నియోజకవర్గానికి అనూహ్యంగా 39 వేలకు పైగా మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ని చేసుకునేందుకు ప్రజలు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో లో గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మరోసారి ప్రజలు సోమవారం జరిగిన ఎన్నికల్లో వైఎ స్సార్ సీపీకి మెజార్టీని కట్టబెట్టేందుకు సిద్ధ మైనట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. దొనకొండ మండలం లో రెండు వేలు, దర్శి మండలం లో, పట్టణం లో రెండు వేలు, తాళ్లూరు మండలం లో ఐదు వేలు చొప్పున వైఎస్ఆర్సిపి కి ఆధిక్యత ఉన్నట్లు , కురిచేడు మండలంలో 1000, ముండ్లమూరు మండలమండలంలో 2000 చొప్పున టిడిపికి ఆధిక్యత వచ్చేటట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గెలుపు పై వైఎస్ఆర్సిపి టిడిపి ఎవరిది ధీమా ను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా పోటాపోటీగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తల నడుమ జరిగిన ఎన్నికల్లో 5వేలకు పైగా మెజార్టీతో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏమి జరుగుతుందో జూన్ 4 వరకు ఫలితాల కోసం ఉత్కంఠతో ప్రజలు ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది.
దర్శిలో ఉత్కంఠ పోరులో వైఎస్సార్సీపీ దే పై చేయి – ఎవరిధీమా… వారిదే
15
May