వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త, నాయకుడు, మహిళలు సైతం చేసిన సేవలు మరువలేనని, బూచేపల్లి కుటుంబాన్ని ఆదరించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి ఆదరించిన ప్రతి కుటుంబానికి, ప్రజలందరికీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందినీరెడ్డిలు ధన్యవాదాలు తెలిపారు. దర్శి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో, బూచేపల్లి నివాసంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి గురించి బూచేపల్లికి నాయకులు వివరించారు. మండలంలో జరిగిన గొడవలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారందరి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి నాయకులతో మాట్లాడుతూ …టీడీపీ నేతలు ఓటమి భయంతో ప్రజలను ఎన్ని ఇబ్బందుల పెట్టాలని చూసినా ప్రజలు వాటిని తిప్పి కొట్టారని చెప్పారు. ఓపికతో సంయమనంగా ఉండి ఓట్లేసిన ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడు కుంటానని డాక్టర్ బూచేపల్లి హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి భారీ మెజార్టీలు వచ్చే బూత్ ల వద్ద గొడవలు సృష్టించారన్నారు. వెళ్లిన ప్రతి బూత్ వద్ద కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతూ
ప్రజలను భయాందోళనకు గురి చేయడం దర్శి చరిత్రలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్ల దాడులు చేసి ఈవీఎంలు ఎత్తుకెళ్తాలని చూడటం పై తమ ఆవేదన వెళ్లబుచ్చారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ..నియోజవర్గంలో మూడు నెలల నుంచి ప్రతి నాయకుడు కార్యకర్తలు మీ శివన్నను గెలింపించాలని బాగా కష్ట పడ్డారని చెప్పారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఎన్నికల కంటే ఇంకా ఎక్కువ పట్టుదలతో పని చేసి గెలుపే లక్ష్యంగా పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచీ నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింలు అంటూ అందరినీ ఆదుకున్నారన్నారు. అన్నీ కులాల పేదలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కోరుకున్నారని చెప్పారు. అనంతరం డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు అందరి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేవ వరం బాధితులకు డాక్టర్ బూచేపల్లి పరామర్శ
దర్శి మండలంలోని దేవవరంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మంగళ వారం పరామర్శించారు. ఈ సందర్భంగా గొడవకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డి వద్దకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి మాట్లాడారు. కర్ర
లతో దాడులు చేశారని, రాళ్లు రువ్వుతూ తమపై విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా భయాందోళనలకు గురయ్యామని విలపించారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ …అందరూ సమన్వ యంతో ఉన్నందుకు అభినందనలని చెప్పారు. ఇకపై ఎలాంటి ఆదోళన చెందాల్సిన పని లేదని, తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.



