బాంబును కొరికిన ఎద్దుకు తీవ్ర గాయాలైన సంఘటన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగాడ్ ధగడ్ గ్రామం లో చోటు చేసుకుంది.గ్రామానికిచెందిన జీత్రు అనే రైతు కు సంబంధించిన ఎద్దు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి గాయాల పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం. గురువారం అడవి పందులను వెటాట డానికి వేసిన నాటు బాంబును ఎద్దు కోరకడంతో అది పేలి ఎద్దు తల దవడ చెల్లాచెదురైందని అన్నారు. ఇంటికి వచ్చిన ఎద్దును చూసిన రైతు ఎలుములే జిత్రు కన్నీరు మున్నీరుగా విలపించాడు.
