ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను తప్పనిసరిగా వారి దైనందిక జీవితంలో ఒక్క పూట తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. తాళ్లూరు వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో పొదుపు సంఘ మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈట్ టు రైట్ కార్యక్రమంలో బాగంగా చిరుధాన్యాలలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు, శక్తి, పీచు పదార్థాం, ఖనిజ లవణాలు, కాల్షియం, ఇనుము వంటి పోషక విలువలపై వివరించారు. చిరుధాన్యాల సాగుకు మహిళలు తమ వంతు కృషి చెయ్యాలని కోరారు. ఎపీఎం దేవరాజ్, ఎఈఓ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

