మహిళలు మీకు జోహార్లు, మీరు సాధించ లేనిది ఏదీ లేదు- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి – భాజపా జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ పునఃవ్యవస్థీకరణ – పలువురికి పదోన్నతి.

మహిళా మోర్చా జిల్లా కార్యవర్గాన్ని పునః వ్యవస్థీకరించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శివారెడ్డి పాల్గొని రెండు నెలల్లో రానున్న “సార్వత్రిక ఎన్నికలలో మహిళల పాత్ర” అనే అంశంపై ప్రసంగించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వారు మాట్లాడుతూ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని దానికి మన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పని చూసుకుంటూ సమాజంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న వీరందరికీ సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క మహిళా కార్యకర్త ముందుగా తాము ఉంటున్న డివిజన్లో, నియోజకవర్గంలో ఉన్న మహిళా ఓటర్లతో సాన్నిహిత్యం ఏర్పరచుకొని పార్టీ యొక్క విధివిధానాలు, మహిళల కోసం, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఆయా మహిళలకు పార్టీ యొక్క ఉన్నత లక్ష్యాన్ని తెలపాలని అన్నారు. తద్వారా వారు బిజెపి అభిమానులుగా మారతారని, వారు తమ కుటుంబ సభ్యుల చేత కూడా బిజెపికి ఓటు వేయిస్తారని వివరించారు.

ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా కార్యవర్గాన్ని పునవ్యవస్థీకరించారు, ఉత్సాహవంతులైన కొందరికి పదోన్నతి కలిగించారు. నియమితులైన వారికి నియమిత పత్రాలు అందించి అభినందించారు. వారిలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా మలినేని గీతాంజలి, ఉపాధ్యక్షులుగా మద్దినేని లక్ష్మీదేవి, గుర్రం కుమారి, బొరుసు లలిత, షేక్ ముతార సుల్తానా, ప్రధాన కార్యదర్శిగా పెల్లేటి శివకుమారి, బి విజయ రావు, కార్యదర్శులుగా డి శ్రీలక్ష్మి, ప్రసన్న జ్యోతి, షేక్ ఆదామ్బి, ధనిశెట్టి పావని, డి అజంతా, జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా లింగంగుంట వనజ లతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు శాసనాల సరోజిని, జిల్లా మహిళా మోర్చా ఇంచార్జ్ తీగల సత్యవతి, భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు జజ్జర కృష్ణవేణి, కార్యదర్శి జువ్విగుంట కోటేశ్వరి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా ఇన్చార్జి రవిశంకర్, ప్రధాన కార్యదర్శి కోరంకి నాగేశ్వరరావు, శివాజీ యాదవ్, మరియు మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *