నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

టీవీ సీరి యల్ నటుడు చంద్రకాంత్ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నార్సింగి పోలీసే స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్ లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగిం ది. స్థానికుల కథనం ప్రకారం.. త్రినయని, రాధమ్మ కూతురు, కార్తీక దీపం లాంటి పలు సీరియళ్లలో నటిస్తు న్న చంద్రకాంత్ (40) అలకాపూర్ టౌన్షిప్లో నివసిస్తున్నారు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. త్రినయని సీరియల్లో తనతో నటించిన పవిత్ర ఇటీవల బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయన పవిత్రతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. పవిత్ర మృ తితో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *