జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్ కు తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని అందుకు అనుగుణంగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనాడు దిన పత్రికలో శుక్రవారం ‘తరుముకొస్తున్న కాలం – కదులుతుందా యంత్రాంగం పేరుతో ప్రచురితమైన కథాన్ని ఆయన ఖడిస్తూ… శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగలు 667, పెసర 390, జనుములు 1716 క్వింటాళ్లు జిల్లాకు కేటాయించారని చెప్పారు. ఖరీఫ్‌లో సాగు చేయటానికి వరి 4000, పెసర 120, మనుము 500, కంది 1500 క్వింటాళ్లు కేటాయించారని, సదరు చిత్తనాలు ఎపీ సీడ్స్ ద్వారా సాధారణ రాయితీపై పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఆయా మండలాలలకు ఇప్పటికే కేటాయించామని రైతులు తమ పరధిలోని ఆర్బికేల ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకులు వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని వారికి కావలసిన విత్తనాలు రాయితీపై పొందవచ్చని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా గత సంవత్సరం 31,600 మినీ కిట్స్ పూర్తి రాయితీపై రైతులకు పంపిణీ చేయటం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం 35,00 కంది కిట్స్ కేటాయింపునకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అవి కూడ అందుబాటులోనికి వస్తాయని, రైతులు తమ వద్ద ఉన్న స్వంత విత్తనాలు కూడ సాగుకు సిద్ధం చేసుకుని ఉన్నారని వివరించారు.
