ప్రపంచ రక్త పోటు దినోత్సవం సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ కె మౌనిక ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి బీపీ వ్యాధి గ్రస్తులకు తగిన సూచనలు చేసారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా అరగంట పాటు నడక లేదా తేలిక పాటి వ్యాయామం చెయ్యాలని చెప్పారు. మంచి ఆహారపు అలవాట్లను పాటించాలని, పౌష్టికాహారంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు వాడుకోవాలని చెప్పారు. బీపీ, ఘగర్ లను పరిశీలించి తగిన మందులు అందించి సూచనలు చేసారు.
