బడి బయట పిల్లలలో- విద్యా చైతన్యం రావాలి- మండల విద్యాశాఖ అధికారి జి. సుబ్బయ్య

బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్చించడానికి వారికి చైతన్య పాటు,చదువు పట్ల ప్రాధాన్యతను మరియు చదువు విలువ గురించి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు చైతన్య కలిగించటం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉన్నదని తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు అందిస్తున్న అనేక పథకా లు విద్యార్థి విద్యార్థులు ఆయా స్థాయిలలో బట్టి వారికి కావలసినటువంటి సౌకర్యాలు అందుపుచ్చుకొని చదువుకు దూరం కాకుండా ఉండాలని ఆయన తెలియజేశారు . దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో విద్యా చైతన్య ప్రచారోద్యమం లో భాగంగా తాళ్లూరు గ్రామం లోని పాములకాలనీ నందు విద్యకు దూరమైన బాల, బాలికలను గుర్తించి బడి బయట కాకుండా బడిలో చేర్పించుట కొరకు ఈ విద్యా చైతన్య ప్రచార ఉద్యమం నిర్వహించడం జరిగినది. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ చదువు ద్వారా జ్ఞానం,తెలివి, పెంచుతుంది తద్వారా సమాజంలో గౌరవప్రదమైన విలువలతో కూడిన చదువు అందించడం ద్వారా గౌరవం పెంచుకోవచ్చని తెలియజేశారు. విద్య హక్కుచట్టం ద్వారా 14 సంవత్సరాల లోపు పిల్లల కు తప్పని సరిగా విద్యను అందిస్తుందని ఆయన తెలియజేశారు. డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు మాట్లాడుతూ అందరికీ చదువుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం వెనుకబడిన బలహీనతల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో కూడా 20 శాతం రిజర్వేషన్లు వసతి సౌకర్యాలు ఉచిత విద్యతో కూడిన సంక్షేమ హాస్టల్స్ లలో ప్రవేశం ప్రభుత్వం వసతులు కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగులూరి దావీదు, నాగులూరి స్వామియేలు,వినోద్, యెహోషువ, గ్రామ పెద్దలు,మహిళలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *