ఎలాంటి కఠిన పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు

సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించటమే ధ్యేయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది సోమవారం కనిగిరిలోని పామూరు బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో “మాబ్ ఆపరేషన్”మాక్ డ్రిల్ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి ఫైరింగ్ చేయుట వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు.

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.

కార్యకమ్రంలో కనిగిరి డిఎస్పీ రామరాజు, కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు, పామూరు సిఐ రామానాయక్, కనిగిరి సర్కిల్ ఎస్సైలు, పామూరు సర్కిల్ ఎస్సైలు, ఆర్.ఎస్.ఐ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *