నవంబర్ 27,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
అండాల సేకరణ, విక్రయాలవ్యవహారంలో మల్కాజ్ గిరి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్
కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రధానకార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
సద్గురు హెల్త్‌కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ గేదెల వెంకట సూర్యకిరణ్ ఈ కేసులో కీలకంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసులకుఅందుబాటులో లేనట్లు
సమాచారం. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయించేందుకు పోలీసులు న్యాయపరమైన చర్యలుచేపడుతున్నట్లు సమాచారం.
అండాల సేకరణ, విక్రయాల వ్యవహారంలో సూర్యకిరణ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ నుంచి సద్గురు హెల్త్‌కేర్ సంస్థకు కోట్లాది రూపాయల నిధులు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న కారణాలు, నిధుల బదిలీకి సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి సద్గురు హెల్త్‌కేర్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోదాలు, విచారణలో వెలుగుచూసే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: