హైదరాబాద్ లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు.ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో రెయిడ్.ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు – ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సాహితీ ఇన్‌ఫ్రా కేసులకు సంబంధించి ఉమామహేశ్వరరావు విచారణ జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం మర్డర్‌ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయ్యారు. డబుల్‌ మర్డర్‌ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *