జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆమ్మవారి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలకు నాంది పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటి గంగా భవానికి ప్రతి రోజు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం 50 మంది మహిళా భక్తులు పాల్గొని లలితా సహస్ర నామ పారాయణం, దేవి ఖడ్గమాల పారాయనం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం మహా చెండి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. పూజారులు ఎన్ కామేశ్వర శర్మ, ప్రకాశరావు, విజయలక్ష్మిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కావలసిన సౌకర్యాలను ఆలయ ఈఓ కార్తిక్, ఆర్ఎ శ్రీనివాసరావులు పర్యవేక్షించారు.

