మలేషియాలో జరిగిన 20వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో కంటోన్మెంట్ బాలంరాయి కి చెందిన ఎమ్. సాయి కుమార్ ప్రథమ స్థానం లో నిల్చిబంగారు పతకం సాధించాడు.
ఈ పోటీలు మే 10 నుండి12 వరకు మలేషియాలో జరిగాయి.
మార్షల్ ఆర్ట్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచుతున్న క్రీడాకారులను తాను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం బీ జే పీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు.
అనంతరం బంగారు పతక విజేత సాయి కుమార్ మాట్లాడుతూ,
*తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు రాములు, శోభ, మాస్టర్ కలిమ్* లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అన్నారు.ఆదివారం ఈటెల రాజేందర్, సదా కేశవ్ రెడ్డి లు గోల్డ్ మెడల్ విజేత సాయి కుమార్ ని సత్కరించారు.



