ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతుగా వారణాశి లో తెలంగాణా బీ జే పి నేతల ప్రచారం.

ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణా రాష్ట్ర బీ జే పి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోనార్ పూర్ లో వారణాశి తెలుగు బ్రాహ్మణ సంఘం తో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం బీ జె పీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యం లోని బీ జే పీ నేతల బృందం. ఎlన్నికల ప్రచారం నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఈ బృందం లో బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, చాడ సురేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ,తిరుపతి యాదవ్, యామాగోని గంగాధర్ గౌడ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా బీ జే పీ బృందం సభ్యులు మాట్లాడుతూ…తెలంగాణలో మమ్ముల్ని గెలిపించడానికి మోడీ వచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ మోడీ కీ ఓటు వేయండి. మేము మీ అందరిని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.మోదీ హయాంలో భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఆయన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మోదీ కి మన సంపూర్ణ మద్దతు తెలుపుదాం అని ఈటల వారితో అన్నారు.ఈ సందర్భంగా వారణాశి తెలుగు బ్రాహ్మణ సంఘం తమ మద్దతును తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *