తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2 న జరగనున్న నేపద్యం లో సికింద్రబాద్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ,డీ జీ పీ రవి గుప్తా లు శుక్రవారం ఉదయం సందర్శించి పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయించిన నేపద్యం లో సీ ఎస్ , డీ జీ పీ లు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. స్టేజీ నిర్మాణం,వి వి ఐ పి,సాధారణ పబ్లిక్ గ్యాలరీలు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రత చర్యల పైన కూడా వారు అధికారులతో చర్చించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎంతో మంది వీ బీ ఐ పి లు కూడా పాల్గొన నున్న నేపద్యం లో పరేడ్ మైదానం తో పాటు పరిసర ప్రాంతాలు కూడా పోలీసుల కట్టుదిట్టమైన భద్రత లో వుండ నున్నాయి. ఈ సందర్భంగా సీ ఎస్ శాంటికుమారి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపద్యం లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పరేడ్ మైదానం లో పోలీ సుల కవాతు ,తెలంగాణా సంస్కృతీనీ ప్రతిభను వెల్లడించే విధంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించేందుకు వీలుగా స్టేజీ నిర్మాణాన్ని చేస్తున్నట్లు వివరించారు .తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కారుల కు ,కీలక వ్యక్తులకు సన్మాన కార్యక్రమం వున్న నేపథ్యంలో సుమారు 2000 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంత కుమారి వెల్లడించారు.రిహార్సల్స్ లో భాగంగా పోలీసులు నిర్వహించిన కవాతు ను సీ ఎస్,డీ జీ పీ లు వీక్షించారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి,ఐ జీ సంజయ్ కుమార్,హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్త కోట శ్రీనివాస రెడ్డి, ఇంటిలీ జెన్సి,ఎస్ బి అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








