సరదా ఆటలు ప్రాణాల మీదకు తెచ్చాయి.. స్నేహితుల మధ్య వివాదంలో ఒకరికి తీవ్రగాయాలు

గ్రామాలలో వేసవిలో సరదాగా ఆడుకునే ఆటలు ప్రాణాల మీదకు తీసుకు వస్తున్న సంఘటనలు అరుదుగా జరుగుతున్నాయి.కురిచేడు మండలంలోని బోదనంపాడు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులు ఆంజనేయ స్వామి గుడి వద్ద సరదాగా చింత పిక్కెలతో ఆటలాడుకుంటున్నారు. ఆట మధ్యలో చిన్న వివాదం వచ్చి ఇరువురు గొడవ పడి చివరకు సీసాలతో పొడుచుకోగా ఒకరి పరిస్థితి విషమంగా మా రింది. బోదనంపాడు గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర బస్ షెల్టర్ ఎదురుగా గ్రామస్థులు సరదాగా కూర్చొని ఆటలు ఆడుకుటుంటూ ఉంటారు. శుక్రవారం కూడా అలాగే 108లో పనిచేసే అబుదావలి, అదే గ్రా మానికి చెందిన వేమా గోవింద రమేష్ లు చింతపిక్కెలతో ఆడుకుంటున్నా రు. ఆట మధ్యలో సరదా సంభాషణ కాస్తా పక్కదారి పట్టి వివాదం చెల రేగింది. అబుదావలి గోవింద రమేష్ ను కొట్టబోయి పక్కనే ఉన్న సీసాతో కొట్టాడు. దీంతో రమేష్ ఆగ్రహంతో పక్కనే బీరు బాటిల్ తో అబుదావలితలపై బాదాడు.సీసా పగిలి అబుదావలి గాయపడ్డాడు. అదే
సమయం లో గోవింద ర మేష్ అబుదావలి గొంతు మీద కాలేసి తొక్కి పట్టి ఇష్టం వచ్చినట్లు ప గిలిన సీసాతో పొడిచాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అబుదావలి అపస్మా రక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే అతడిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అబుదావలిని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు, అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. సరదాగా అడుకునే ఆటలు చివరకు ప్రాణా ల మీదకు తెచ్చాయని స్థానికులు అంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *